పూతలపట్టు: కాణిపాకంలో వైభవంగా స్వామివారి పూలంగి సేవ
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి పూలంగి సేవ ఘనంగా జరిగింది. కళ్యాణ వేదిక వద్ద స్వామివారిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.