అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని క్రిష్టపాడు గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పెద్దవడుగూరు మండలం క్రిష్టపాడుకు చెందిన వరలక్ష్మి గత కొన్ని రోజులుగా అనారోగ్యసమస్యలతో పాటుగా కుటుంబ సమస్యలతో బాధ పడుతుండేది. పలు ఆసుపత్రులలో చికిత్సలు చేయించుకున్నా వ్యాధి నయం కాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వరలక్ష్మి జీవితం మీద విరక్తి చెంది ఆదివారం విష ద్రావకం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న వరలక్ష్మిని వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు.