మహబూబాబాద్: గత నాలుగు సంవత్సరాలుగా అద్దె బకాయి చెల్లించలేదంటూ సంద్రాలగూడెం గ్రామపంచాయతీ కార్యాలయనికి తాళం వేసిన యజమాని..
గతనాలుగే ళ్లుగా గ్రామపంచాయతీ కార్యాలయానికి చెల్లించాల్సిన అద్దే బకాయి చెల్లించాలంటూ ఇంటి యజమాని కార్యాలయానికి తాళం వేసి నిరసన చేపట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లా సండ్రాల గూడెం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం 2:30 నిమిషాలకు చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన మహమ్మాద్ బాబు మియా అబ్బాస్ బీ దంపతులకు చెందిన భవణాన్ని నూతనంగా ఏర్పడిన సండ్రాల గూడెం గ్రామ పంచాయతి కార్యాలయానికి అద్దే కు ఇచ్చారు.తోలుత అద్దే సంక్రమంగా చెల్లించారని, గత నాలుగేళ్లుగా అద్దే చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.