శ్రీశైలం: శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మార్కాపురం MLAకందుల నారాయణరెడ్డి దర్శనం చేసుకున్నారు.కుంభోత్సవం సందర్భంగా అమ్మవారికి అర్చకులు ఏకాంతంగా పూజలు నిర్వహిస్తుండటంతో భక్తుల దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు శ్రీ మల్లికార్జున స్వామివారిని మాత్రమే దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన మంత్రికి ఈవో శ్రీనివాసరావు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.దర్శనానంతరం మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రత్యేక బోటు ద్వారా వెలుగొండ ప్రాజెక్టు సందర్శనార్థం వెళ్ళారు.