గుంతకల్లు: గుత్తి మండలం పి.ఎర్రగుడి గ్రామంలో వడదెబ్బతో సొమ్మసిల్లి పడిన కూలీ, పరిస్థితి విషమం, అనంతపురంకు తరలింపు
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని పి.ఎర్రగుడి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే కూలీ వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలం పి.ఎర్రగుడి గ్రామానికి చెందిన వెంకటేష్ గ్రామ శివారులో ఉన్న వాగుల వద్ద లభించే బోద గడ్డి కోసుకుని వచ్చి గంపలు, చాటలు, చీపుర్లు తయారు చేసి విక్రయించుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే వెంకటేష్ గ్రామ శివారులో వంక వద్ద గడ్డి కోసం వెళ్ళి వడదెబ్బతో పడిపోయాడు.