శ్రీశైలం: ఆత్మకూరు నుంచి శ్రీశైల క్షేత్రానికి వెళ్లడానికి సరిపడా బస్సు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రయాణికులు
ఆత్మకూరు నుంచి శ్రీశైలం క్షేత్రానికి వెళ్లేందుకు సరిపడా బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి ఆత్మకూరు చేరుకొని ఆత్మకూరు నుంచి శ్రీశైలంకి ఎక్కువగా ప్రయాణికులు వెళుతుంటారు. అయితే ఆత్మకూరు వచ్చిన తర్వాత ఇక్కడ బస్సు సౌకర్యాలు లేక ప్రయాణికులు రెండు మూడు గంటలు వేచి ఉండి బస్సులలో నిలబడి వెళుతున్నారు.బస్సులో ఎక్కించుకోకపోతే డ్రైవర్లతో వాగ్వాదానికి దిగి నిలబడి మరి వెళ్తున్నారు. వెంటనే ప్రభుత్వం కల్పించుకొని ఆత్మకూరు నుంచి శ్రీశైలానికి సర్వీసులు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.