కొండపి: పొన్నలూరులో ఓవీ రోడ్డుపై వాహనాలను తనిఖీ.. వాహనదారులకు పదివేల రూపాయల విలువైన చలానాలను విధించిన ఎస్సై అనూక్
పొన్నలూరులో ఓవీ రోడ్డుపై బుధవారం స్థానిక ఎస్సై అనూక్ వాహనాలను తనిఖీ చేశారు . ఈ సందర్భంగా లైసెన్సులు, హెల్మెట్లు లేని వాహనదారులను గుర్తించి ఈ చలనా ద్వారా 10వేల విలువైన జరిమానాలను విధించారు. ఆటో డ్రైవర్లు పరిమిత సంఖ్యలో ప్రయాణికులు ఎక్కించుకొని రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. కారు నడిపేటప్పుడు తప్పక సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్తో పాటు లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.