కొండపి: మర్రిపూడి మండలం దుగ్గిరెడ్డిపాలెంలో అభయ ఆంజనేయ స్వామి తిరునాళ్ల.. విద్యుత్ ప్రభ పై ఆదరించిన యువతుల డాన్స్
మర్రిపూడి మండలంలోని దుగ్గిరెడ్డిపాలెంలో అభయ ఆంజనేయ స్వామి తిరునాళ్ల ఘనంగా నిర్వహించారు. తిరునాళ్లను పురస్కరించుకుని గ్రామంలో విద్యుత్ ప్రభను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమలలో భాగంగా సోమవారం రాత్రి విద్యుత్ ప్రభపై సినిమా పాటలకు డాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.