పాడేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం గోదామును తనిఖీ చేసిన అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ బుధవారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. గోదాములను సందర్శించి, అక్కడ పరిస్థితిని గమనించారు. గోదాములకు వేసిన సీళ్లను, ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. పర్యవేక్షణ రిజిస్టర్ లో సంతకం చేశారు. గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు