అదిలాబాద్ అర్బన్: గిరిజనుల కుల ధ్రువీకరణ పత్రాల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల సమస్యలపై బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా కుల ధ్రువీకరణ పత్రాల జారీలో నెలకొన్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సమక్షంలో ఈ సమావేశం జరిగింది.