పటాన్చెరు: 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలు పటాన్చెరు మైత్రి మైదానంలో ప్రారంభం
69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలు గురువారం పటాన్చెరు మైత్రి మైదానంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి తరలివచ్చిన విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, పాఠశాలల ప్రతినిధులు పోటీల్లో పాల్గొంటున్నారు. MLA గూడెం మహిపాల్ రెడ్డి ఆతిథ్యం వహిస్తున్నారు. MLA మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని రాష్ట్ర, జాతీయ క్రీడలకు కేంద్రంగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అని చెప్పారు. నియోజకవర్గంలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆర్థికంగా, మానసికంగా క్రీడలపై ప్రోత్సాహం ఇస్తున్నట్లు వివరించారు.