గత ఐదేళ్లలో అరటి రైతులకు బీమా ఇచ్చానంటూ జగన్ చేస్తున్న ప్రకటన అబద్ధమని MLC రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. 2019-24 మధ్య ఒక్క ఎకరాకు కూడా అరటి పంట బీమా చెల్లింపులు జరగలేదన్నారు. ఒక్క పైసా ప్రీమియం చెల్లించలేదని స్పష్టం చేశారు. నిజంగా బీమా ఇచ్చిన రికార్డులు ఉంటే చూపించాలన్నారు. రికార్డులను చూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. రికార్డులు లేకపోతే జగన్ పదవికి రాజీనామా చేయాలన్నారు.