శ్రీకాకుళం: నరసన్నపేటలో నామినేషన్ వేసిన వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి యాళ్ల విజయ కుమారి
నరసన్నపేట మండలం మాకివలస ఎంపీటీసీ అభ్యర్థిగా యాళ్ల విజయ కుమారి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ఎంపిక చేశామని, ఈ రెండు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుందని ఆయన తెలిపారు.