గుంతకల్లు: గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో పెట్రోల్ పోసి నిప్పంటించిన గృహాన్ని పరిశీలించిన పోలీసులు, ఫోరెన్సిక్ బృందం
అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో మూఢ నమ్మకాలతో చేయబడి చేసి తనపై తొండ విసిరాడని శ్రీనివాసులు అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన గృహాన్ని పోలీసులు, ఫోరెన్సిక్ బృందం నిపుణులు శనివారం పరిశీలించారు. గ్రామంలోని గృహాన్ని వారు పరిశీలించి ప్రమాదంలో కాలిన పదేళ్ల బాలిక లక్ష్మీకి సంబంధించిన దుస్తులు, ఇంట్లోని వస్తువులు, పెట్రోల్ తెచ్చిన బాటిల్ ను వారు స్వాధీనం చేసుకున్నారు. నిప్పు పెట్టిన ఆధారాలను ఫోరెన్సిక్ బృందం సేకరించి ల్యాబ్ కు తరలించింది.