నారాయణపేట్: అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో దామరగిద్ద మండల కేంద్రంలో బంద్ విజయవంతం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చేపట్టిన రాష్ట్ర బంద్ సందర్భంగా నారాయణ పేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలో శనివారం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ మండల నాయకులు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం అమలు పరచడంలో బిజెపి కాలయాపన చేస్తుందని అన్నారు.