మహబూబాబాద్: నెలకుదురులో వృద్ధురాలిని మంత్రాల నెపంతోనే హత్య చేసినట్లు వివరాలను వెల్లడించిన డిఎస్పి కృష్ణ కిషోర్..
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పోలీస్ స్టేషన్లో తొర్రూర్ డిఎస్పి కృష్ణ కిషోర్ సమావేశం నిర్వహించి హత్య కేసు వివరాలను బుధవారం మధ్యాహ్నం 2:00 లకు వెల్లడించారు.. నెల్లికుదురు మండలంలో ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి వృద్దురాలిని హత్య చేసి బావిలో పడవేసిన నిందితులను పట్టుకున్నామని తెలిపారు. మంత్రాల నెపంతోనే వృద్దురాలైన రాధమ్మ ను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య చేసిన సమీప బంధువులు ఉప్పలయ్య, మహేష్ వారికీ సహకరించిన 3 గురు వ్యక్తులను రిమాండ్ కు తరలించమని తెలిపారు.