శ్రీశైలం: వివాహేతర సంబంధమే కరిముల్లా హత్యకు కారణమా. ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు
నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామ శివారులో దారుణ హత్య కలకలం రేపింది. బండిఆత్మకూరుకు చెందిన కరీముల్లాను గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి హతమార్చారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమా లేక మరే ఇతర వ్యక్తిగత విభేదాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.