నిర్మల్: వెంగ్వాపేట్ గ్రామంలో నూతన ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభం
Nirmal, Nirmal | Oct 16, 2026 నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్, సర్పంచ్ సాద వనిత పాల్గొన్నారు.