పొన్నూరు: సంగం జాగర్లమూడి బకింగ్ హోమ్ కెనాల్ లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సంగం జాగర్లమూడిలోని బకింగ్ హాం కెనాల్ కాలువలో గుర్తుతెలియని మృతదేహం నీటిపై తేలియాడుతూ శుక్రవారం కనిపించింది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో, అది ఎక్కడ నుంచో కొట్టుకువచ్చినట్లుగా భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.