గుంటూరు: యానిమేటర్ల ఉద్యోగ భద్రతను దెబ్బతీసే మూడేళ్ల కాల పరిమితి జీఓ రద్దు చేయాలని కోరుతూ గుంటూరు డిఆర్డిఏ కార్యాలయం వద్ద నిరసన
Guntur, Guntur | Sep 16, 2025 యానిమేటర్ల ఉద్యోగ భద్రతను దెబ్బతీసే మూడేళ్ల కాలపరిమితి జీవోను రద్దు చేయాలని కోరుతూ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గుంటూరులోని డీఆర్డీఏ కార్యాలయం వద్ద ధర్నా మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్న ఈ జీవోను తక్షణమే రద్దు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.