పూరీ జగన్నాధ రథోత్సవంలో నేడు తిరుగు ప్రయాణం పురస్కరించుకుని భీమడోలులో శనివారం రాత్రి జగన్నాథ రథోత్సవాన్ని నిర్వహించారు. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన భక్తులు స్థానికులతో కలసి భీమడోలు గ్రామం నుంచి భీమడోలు జంక్షన్ మీదుగా పొలసానిపల్లికి రథోత్సవం నిర్వహించారు. పూరీలో వలే దేవత మూర్తులను అలంకరించిన రథం పై ఉంచి అర్చకులు మంత్రోచ్చరణ మధ్య ఊరేగింపు నిర్వహించారు. ఈసందర్బంగా అర్చకులు మాట్లాడుతూ నేడు పూరీలోని గుండిచా మందిరం నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్రల తిరుగుయాత్ర నిర్వహించిన సందర్బంగా ఈ యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు.