పెద్దాపురంలో గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీ విజేతలకు బహుమతి ప్రధానం
మహాకవి గురజాడ అప్పారావు 163 వ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా పెద్దాపురం యాసలపు సూర్యరావు భవనంలో విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖన పోటీలో గెలుపొందిన వారికి, ఆదివారం మధ్యాహ్నం చిల్డ్రన్స్ లో అధ్యక్షులు బుద్ధ శ్రీనివాస్ అధ్యక్షతన బహుమతులను అందజేశారు.ఈ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు జ్యోతుల కృష్ణ బాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,గురజాడ అప్పారావు కన్యాశుల్కానికి వ్యతిరేకంగా పోరాడారని అన్నారు.దేశమును ప్రేమించమన్న గీతంతో ప్రపంచంలోని ఎవరైనా ఈగీతాన్ని పాడుకొనే విధంగా గీతాన్ని తయార చేసిన ఘనత గురజాడ అప్పారావు దే అన్నారు.