ఒంగోలు అర్బన్: ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Aug 3, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్ రాజాబాబుకు అర్జీలు సమర్పించారు. వచ్చిన అర్జీలు అన్నిటిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని కలెక్టర్ రాజాబాబు అర్జీదారులకు తెలిపారు. కొన్నిటిని తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ప్రజల సమస్యల పరిష్కారం కొరకే ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు కలెక్టర్ అన్నారు.