నేరడిగొండ: లక్కంపూర్లో మంత్రి సీతక్క పర్యటనలో ఉద్రిక్తత, ప్రోటోకాల్ పాటించటం లేదని ఎమ్మెల్యే వర్గీయుల ఆందోళన
ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి సీతక్క కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.నేరడిగొండ మండలం లక్కంపూర్ లోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను మంత్రి సందర్శించారు. అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వర్గీయులు ఆందోళన చేపట్టారు. హాస్టల్లో కామన్ డైట్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమ బ్యానర్ పై బోత్ ఎమ్మెల్యే ఫోటో ఏర్పాటు చేయలేదని అధికారులతో ఎమ్మెల్యే వర్గీయులు వాగ్వాదానికి దిగారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,మంత్రి సీతక్క డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అధికారులపై మండిపడ్డారు.