జనగాం: పర్యావరణహితంగా వినాయక చవితి: ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
పర్యావరణ పరిరక్షణ కోసం 3వ వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి ఆధ్వర్యంలో బాలాజీ నగర్, జీఎంఆర్ కాలనీ ప్రాంతాల్లో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.