శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానంలో సాలు మండపాల నిర్మాణ వివాదం, ముఖ్యమంత్రికి లేఖ రాసిన చైర్మన్ రమేష్ నాయుడు
శ్రీశైలం దేవస్థానంలో సాలు మండపాల నిర్మాణం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. దేవాదాయ శాఖ కమిషనర్‌పై దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.సుమారు రూ.19 కోట్లతో సాలు మండపాల నిర్మాణానికి టెండర్లను ఆమోదించాలని దేవాదాయ శాఖ కమిషనర్ ఒత్తిడి తెస్తున్నారని చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఆరోపించారు. ఈ టెండర్లను ధర్మకర్తల మండలి ఇప్పటికే రెండుసార్లు తిరస్కరించిందని తెలిపారు. అయినప్పటికీ ట్రస్ట్ బోర్డును పక్కనపెట్టి టెండర్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారని విమర్శించారు.మాస్టర్ ప్లాన్‌లో లేని సాలు మండపాల కంటే, ప్రస్తుతం భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తరహాలో నూతన క్యూ కా