మహానంది మండలం అబ్బిపురం గ్రామంలోని ఓ ఇంట్లోని దేవుని గుళ్లో పడగ విప్పిన నాగుపాము
మహానంది మండలం నల్లమల అడవి సమీపంలోని అబ్బిపురంలో నాగుపాము కలకలం రేపింది.బాలకృష్ణ అనే వ్యక్తి ఇంట్లోకి నాగుపాము చొరబడడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ స్నాచర్ మోహన్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న స్నేక్ స్నాచర్ మోహన్ అక్కడికి చేరుకుని చాకచక్యంగా నాగుపామును పట్టుకున్నాడు.అనంతరం పట్టుకున్న నాగుపామును సమీపంలోని నల్లమల అడవిలో సురక్షితంగా వదిలిపెట్టాడు. దీంతో బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.