అదిలాబాద్ అర్బన్: వినియోగదారులు నాణ్యమైన వస్తువులనే కొనుగోలు చేయాలి: వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్
వినియోగదారులు వారికి ఉన్న హక్కులను తెలుసుకోవడంతో పాటు నాణ్యమైన వస్తువులను కొనుగోళ్లు చేసుకోవాలని వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ అన్నారు. వినియోగదారుల హక్కుల సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జాతీయ కంజుమర్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో సంతకాల సేకరణ చేపట్టగా సీఐతో పాటు సానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ ముఖ్య అథితిగా హాజరయ్యారు. వారు సంతకాలు చేసినంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.