పని గంటలు పెంపుదలను ఉపహాసంహరించుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో పెద్దాపురం తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా.
కాకినాడ జిల్లా పెద్దాపురం పట్నం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట, మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర అసెంబ్లీ చేసిన పది గంటల పని పెంపుదలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, సిఐటియు పెద్దాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి డి క్రాంతికుమార్ మాట్లాడుతూ, దాదాపు 15 ఏళ్లగా కంపెనీలోని ఒక రూపాయి కూడా వేతనాలు పెంచడానికి ప్రభుత్వం నిర్ణయం చేయలేదని ఇది కనిపించిందా అని ప్రశ్నించారు మహిళలు రాత్రి 7 గంటల తరువాత కూడా పని చేయవచ్చు అని చెప్పడం అంటే, మహిళల భద్రత పట్ల ఎంత ఘోరంగా ఆలోచిస్తున్నారో అర్థమవుతుందన్నారు.