శ్రీశైలం: ఆత్మకూరు మండలం సిద్దాపురం చెరువు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీ.తెగి పడిపోయిన యువకుడి చెయ్యి
ఆత్మకూరు మండలం సిద్దాపురం చెరువు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో డేరంగుల అభిలాష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బైర్లూటీ నుంచి మోటార్ సైకిల్ పై ఎస్ఎన్ తాండకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఢీకొన్న వేగానికి యువకుడి చెయ్యి పూర్తిగా విరిగి పక్కకు పడిపోయింది.కొన ఊపిరితో ఉన్న మైనర్ బాలుడిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారుప్రమాదానికి కారణమైన వాహనం కోసం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.