శ్రీశైలం: శ్రీశైల దేవస్థాన శ్రీస్వామివారి స్పర్శదర్శనం టికెట్లు ఇక నుండి మనమిత్ర వాట్సప్ లో లభ్యం: ఈవో శ్రీనివాసరావు
శ్రీస్వామివారి స్పర్శదర్శనం టికెట్లు కూడా మనమిత్ర వాట్సప్ ద్వారా పొందే అవకాశం కల్పించామని శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. దర్శనాలతో పాటు మొత్తం 18 రకాల సేవా టిక్కెట్లను మనమిత్ర ద్వారా పొందే అవకాశం ఉందన్నారు. అలాగే మనమిత్ర ద్వారా పరోక్ష సేవా టికెట్లు కూడా పొందే సదుపాయం ఉందన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈవో కోరారు