వాంకిడి మండలం నవేగూడ గ్రామంలో సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఆదివారం గ్రామంలో నగర సంకీర్తన చేశారు. సత్యసాయి సేవా సమితి కన్వీనర్ వాడై సోనాజీ మాట్లాడుతూ.. ప్రపంచానికి సత్య ధర్మశాంతి ప్రేమలను అందించిన పుట్టపర్తి సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలను గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. సాయంత్రం అన్నదానం, కీర్తన, బాలా వికాస్ విద్యార్థుల నృత్యం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు