ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం సాయంత్రం పుట్టపర్తి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. పుట్టపర్తి సత్య సాయిబాబా శత జయంతోత్సవాలలో పాల్గొనడం కోసం విచ్చేశారు. ఈ సందర్భంగా మడకసర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు తోటి ఎమ్మెల్యేలతో కలిసి నారా లోకేష్ కు విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు.