జహీరాబాద్: పత్రికా స్వేచ్ఛ పై దాడిని ఖండిస్తూ ఆర్డిఓ కార్యాలయం వద్ద జర్నలిస్టుల నిరసన
ప పత్రికత్రికా స్వేచ్ఛ పై దాడిని ఖండిస్తూ జర్నలిస్టులు నిరసన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాదులోని సాక్షి ప్రధాన కార్యాలయంలో గత ఐదు రోజులుగా ఆంధ్ర పోలీసులు కారణం లేకుండా ఎడిటర్ ధనుంజయ రెడ్డి పై కక్ష సాధింపు చర్యలు చేపడుతూ పత్రిక స్వేచ్ఛను హరిస్తున్నారన్నారు. ఈ దాడులు ఇలానే కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో దేవుజా ను కలిసి వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గం జర్నలిస్టులు పాల్గొన్నారు.