పార్టీ ఫిరాయింపులపై ఈటల రాజేందర్ స్పందించారు. ఫిరాయింపులపై స్పీకర్ ఇస్తున్న తీర్పులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని, కొత్త చట్టం రావాల్సిన అవసరముందన్నారు. గతంలో KCR కూడా ఇదే పని చేశారని విమర్శించారు. ఇకనైనా ఫిరాయింపుల చట్టాన్ని దెబ్బతీయొద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.