కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంపై ఈడి దాడులకు దాడులకు వ్యతిరేకంగా ఆత్మకూరులో CPM పార్టీ నిరసన
కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంపై తిరువనంతపురం లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన దాడులకు వ్యతిరేకంగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందర నిరసన కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్ మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేరళలో సిపిఎం పార్టీని బలహీన పరచాలనే ఉద్దేశంతో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేయటం సమంజసం కాదన్నారు.అరెస్టులు, బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు, కేసులు నమోదు చేయడం ద్వారా సిపిఎం పార్టీని బలహీన పరచాలేరన్నారు.