భీంపూర్: నిపానిలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించాలి:ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తవార్ రాజేశ్వర్
భీంపూర్ మండలం నిపాని గ్రామంలో ఇటివల మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. గాంధీ విగ్రహ ధ్వంసం ఘటనను ఖండిస్తూ బుధవారం గ్రామంలో నిరసన చేపట్టారు. అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు కొత్తవార్ రాజేశ్వర్, హరీష్, ఉల్లాస్, దివాకర్, రాజు, తదితరులున్నారు.