పామూరు మండలంలోని పడమటి కట్ట కింద పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పామూరు మండల తహసిల్దార్ వాసుదేవరావు ఎఎంసి చైర్మన్ రమా శ్రీనివాస్ తో కలిసి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడి కేంద్రంలోని రికార్డులను తహసిల్దార్ పరిశీలించారు. అంగన్వాడి కేంద్రాలను సకాలంలో తెరవాలని ,విధులకు డుమ్మా కొడితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సరఫరా చేస్తున్న పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా చిన్నారులు, బాలింతలు, గర్భవతులకు అందించాలని అంగన్వాడీ కార్యకర్తకు సూచించారు.