కార్తీకమాసంలో 41 రోజుల పాటు శివదీక్ష మండల దీక్షను స్వీకరించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నేటితో 41 రోజుల మండల దీక్ష పూర్తి కావడంతో ఇరుముడిని కట్టుకొని సొంత గ్రామం అయిన వేల్పనూరు నుంచి శ్రీశైలం వెళ్లారు,అక్కడ ఆలయ రాజగోపురం వద్దకు చేరుకోగానే, ఆలయ అర్చకులు ఈవో శ్రీనివాసరావు ఆలయ మర్యాదలు అనుసరించి ఎమ్మెల్యే కు స్వాగతం పలికారు,అనంతరం ఇరుముడితో మల్లికార్జున స్వామిని భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు, ఆ తర్వాత వృద్ద మల్లికార్జున స్వామి వద్ద ఇరుముడిని సమర్పించి దీక్షను విరమించారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి,