ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి మండల కేంద్రంలో అస్వస్థతకు గురై హాస్టల్ విద్యార్థిని మృతి
అస్వస్థతకు గురై హాస్టల్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన అదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రవెల్లి మండలం వాల్గొండకు చెందిన మడావి గంగోత్రి (14) ఇంద్రవెల్లిలోని వసతి గృహంలో 9వ తరగతి చదువుకొంటోంది. శనివారం విరేచనాల బారిన పడగా ఏఎన్ఎం విజయ ఆమెను మొదట ఇంద్రవెల్లి పీహెచ్‌సికి తరలించి అనంతరం రిమ్స్‌కు తరలించారు. రిమ్స్ వైద్యులు పరిశీలించి ఆమె అప్పటికీ మృతి చెందినట్లు ప్రకటించారు.