భవనాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలి..రణంబడి, లగిసపల్లి గ్రామాల్లో పర్యటించిన పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ
పాడేరు మండలంలో నిర్మాణాలు పూర్తయిన పలు భవనాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీ పూజ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం రెగ్యులర్ ఇన్స్పెక్షన్ లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరు మండలంలోని రణంబడి గ్రామంలో పర్యటించారు. మల్టీ పర్పస్ సెంటర్ ను పరిశీలించారు. అనంతరం లగిసిపల్లి గ్రామంలో పర్యటించారు. గోకులం షెడ్ ను పరిశీలించారు. భవన నిర్మాణాలు పూర్తయ్యాయని, ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.