శ్రీశైలం: విఐపి బ్రేక్ దర్శనాల విషయంలో శ్రీశైలంలో దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం, మరోసారి భక్తుల ఆగ్రహాం
శ్రీశైలంలో దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం మరోసారి భక్తుల ఆగ్రహానికి కారణమైంది. ఎలాంటి ముందస్తు అధికారిక ప్రకటన విడుదల చేయకుండా నేటి నుంచి సోమవారం వరకు ఉదయం జరిగే వీఐపీ బ్రేక్ దర్శనాలను దేవస్థానం అధికారులు నిలిపివేశారు. ఈ నిర్ణయంపై దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, ట్రస్టు బోర్డు సభ్యులు స్పందించకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేసిన అధికారులు శనివారం, ఆదివారం, సోమవారం రోజుల్లో రాత్రి వేళల్లో మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకు టికెట్లు జారీ చేస్తున్నారు.