మండపేట: హత్యాయత్నం కేసులో ముగ్గురికి రిమాండ్....
ముమ్మర గాలింపు జరిపి నిందితులను పట్టుకున్న మండపేట పట్టణ పోలీసులు...
మండపేట పట్టణ పరిధిలో మంగళవారం రాజస్థాన్ కి చెందిన చిరు వ్యాపారి దయాచంద్ పై మండపేటకు చెందిన ముగ్గురు యువకులు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో బాధితుడి పిర్యాదు మేరకు పట్టణ ఎస్సై ఎల్. నాంచారయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే పట్టణ సీఐ అఖిల్ జమా ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. అయితే ముగ్గురు వ్యక్తులు పట్టణానికి చెందిన మందపల్లి డేనియల్, కోడూరి మణికంఠ, వీరిన మహేష్ లుగా మీడియాకు వెల్లడించారు. వీరిని ఆలమూరు న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు తెలిపారు. నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించడంతో రాజమండ్రి తరలించారు.