శ్రీశైలం: శ్రీశైల క్షేత్రంలో భారీగా మద్యం పట్టివేత .314 మద్యం బాటిళ్ళు స్వాదినం 5గురు మహిళలు అరెస్టు
శ్రీశైలం మహాక్షేత్రంలో పోలీసులు భారీగా మద్యం పట్టుకున్నారు. ఆత్మకూరు నుండి మద్యం తీసుకొచ్చి క్షేత్రంలో బెగ్గర్స్‌కు, హోటళ్లలో పని చేసే వారికి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు టోల్ గేట్, టూరిస్ట్ బస్ స్టాండ్, రామయ్య మలుపు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదుగురు మహిళల వద్ద 314 క్వార్టర్ బాటిళ్లు, 24 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒకరు దోర్నాల, మిగిలిన నలుగురు ఆత్మకూరు ప్రాంతాలకు చెందినవారని గుర్తించారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం ఆత్మకూరు తరలించారు.