శ్రీశైలం-దోర్నాల మధ్య నల్లమల్ల ఘాట్ రోడ్ లో ఒకే ప్రాంతంలో రెండు వేరువేరు బస్సు ప్రమాదాలు.
దోర్నాల,శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిన్నారుట్ల వద్ద వరుసగా రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురికావడం కలకలం రేపింది.శ్రీశైలం నుంచి వస్తున్న మార్కాపురం డిపో బస్సు ఎదురుగా వస్తున్న మరో బస్సును తప్పించబోయి అదుపుతప్పి చిన్న గుంతలో బోల్తా పడింది.ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉండగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టి బయటకు వచ్చి,అనంతరం మరో బస్సులో తమ ప్రయాణాన్ని కొనసాగించారు.ఇదే ప్రాంతంలో శ్రీశైలం నుంచి విజయవాడ వెళ్తున్న ఇంద్ర బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రైలింగ్‌ను ఢీకొట్టి ఆగిపోవడంతో అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డార