అవకాశం వస్తే వైఎస్ఆర్సీపీ తరుపున అమలాపురం ఎంపీగా పోటీ చేస్తా: అమలాపురం ఎంపీ అనురాధ భర్త టీఎస్ఎన్ మూర్తి
అవకాశం వస్తే అమలాపురం పార్లమెంట్ బరిలో ఉంటానని ఎంపీ చింతా అనురాధ భర్త TSN మూర్తి అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారని, అవకాశం వస్తే అమలాపురం పార్లమెంటు స్దానానికి వైఎస్ఆర్సీపీ తరుపున పోటీ చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ నాకు 2019లో పోటీ చేసే అవకాశం ఇచ్చినా ఉద్యోగ రీత్యా కుదరక ఎంపీగా అనురాధకు అవకాశం కల్పించానని తెలిపారు. ఇప్పుడు రిటైర్ అయ్యాను కనుక ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉంటానని టీఎస్ఎన్ మూర్తి అన్నారు.