సంగారెడ్డి: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం తార్దన్ పల్లి లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించారు. ఇందిరమ్మండ్ల నిర్మాణ పనులకు ఇసుక కొరత రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మండ్లను స్వయంగా వెళ్లి పరిశీలించడంతోపాటు లబ్ధిదారులతో మాట్లాడారు. ఇండ్లు మంజూరైన ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణ పనులు చేపట్టేలా చూడాలని ఇందిరమ్మ కమిటీల సహకారం తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.