నారాయణపేట్: విద్యుత్ వినియోగదారులు సకాలంలో కరెంట్ బిల్లులు చెల్లించాలి: విద్యుత్ పట్టణ ఏఈ మహేష్ గౌడ్
నారాయణపేట పట్టణ విద్యుత్ వినియోగదారులు కరెంటు బిల్లులు ఇచ్చిన నిర్ణిత గడువులోపు బిల్లులను చెల్లించాలని గడువులోపు బిల్లులు చెల్లించి నట్లయితే అపరాధ రుసుము కట్ట నవసరం లేదని, నిర్ణీత గడువు 14 రోజులు అయిన తర్వాత బిల్లులు చెల్లించిన చో 100 రూ. అదనపు చార్జీలు చెల్లించవలసి వస్తుందని పట్టణ ఏఈ మహేష్ గౌడ్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. కాబట్టి విద్యుత్ వినియోగదారులు సకాలంలో విద్యుత్తు బిల్లులను చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు.