శ్రీశైలం: ఆత్మకూరు ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన మహిళ
ఆత్మకూరు ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ల నిర్లక్ష్యంపై గురువారం సాయంత్రం ఓ మహిళ ఉద్యోగి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది.ఆత్మకూరుకు చెందిన ఓ యువతి వెలుగోడు మండలంలోని మోత్కూరు సచివాలయంలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. విధుల అనంతరం తిరిగి ఆత్మకూరు వచ్చేందుకు బస్టాప్ వద్ద వేచి ఉన్నా బస్సులు ఆపకపోవడంతో ఆమె తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.