శ్రీశైలం: ఆత్మకూరు మండలంలో పలు గ్రామల్లో జనాభా గణన కార్యక్రమం పరిశిలించిన తహశీల్దార్ రత్నా రాధిక
ఆత్మకూరు మండలంలో జనాభా గణన కార్యక్రమం భాగంగా ఇంటి జాబితా గణన ప్రక్రియ ప్రారంభమైంది. తహశీల్దార్ రత్నా రాధిక ఈ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా యూనిమేటర్లకు పలు సూచనలు చేస్తూ, ఒక్క ఇంటిని కూడా వదిలిపెట్టకుండా, పూర్తిగా పారదర్శకంగా గణన నిర్వహించాలని, నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ పరిశీలనలో డిప్యూటీ ఎంపీడీఓ బాలు నాయక్, ఏఎస్ఓ సాహెబ్ పీర్, అలాగే స్వర్ణ గ్రామం సిబ్బంది పాల్గొన్నారు.